Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం జానంపేట హైస్కూల్ నందు పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యాబోధన చెప్పే మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వర్కర్లతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులు పెడుతూ విద్యార్థులు, వర్కర్లపై లైంగిక వేధింపులకు పాల్పడడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీను, సీఐటీయూ నాయకుడు మునిగల శివప్రశాంత్ అన్నారు. సోమవారం జానంపేట హైస్కూల్లో విద్యార్థులతో వారు మాట్లాడారు. ఈ కీచక ఉపాధ్యాయుడు ఒక్క జానంపేట స్కూల్లోనే కాకుండా గతంలో మణుగూరు కో ఎడ్యుకేషన్ స్కూల్లో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడి కేసుల పాలవడం అప్పట్లో సంచలనంగా మారిందన్నారు. అయిన బుద్ధి మార్చకొని ఈ ప్రబుద్ధుడు ఆ తరువాత పైరవీలతో మళ్ళీ ఉద్యోగంలో చేరి పాండురంగాపురంలో అమ్మాయిపై లైంగిక దాడి, టేకులపల్లి మండలం బోడులో మరో అమ్మాయిపై లైంగిక దాడికి పాలడ్డాడని, తరువాత జానంపేట హైస్కూల్లో ఈ జరిగిన ఘటన కాకుండా గతంలో రెండు సంఘటనలు జరిగినవి అవి వెలుగులోకి రాకుండా విద్యార్థుల్ని బెదిరించి బయటికి రాకుండా కీచక టీచర్‌గా మారి నాడు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో వేధిస్తున్న టీచర్ ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థు లనుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు.