Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
ఉపాధి హామీ సాంకేతిక సహాయక అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అశ్వాపురం మండలానికి చెందిన టెక్నికల్ అసిస్టెంట్ కోడిమెళ్ళ వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జొన్నలగడ్డ రాము, గడ్డం పాపారావు, రవి, మహేష్, కాంతారావు, నాగరాజు ఇతర సాంకేతిక సహాయక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న సాంకేతిక సహాయం అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానన్నారు.