Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆ నలుగురిని వెంటనే బర్తరఫ్ చేయాలి
అ వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-మణుగూరు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిని అవమానించే విధంగా మాట్లాడడం సరైంది కాదని తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమ్మ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిలను అధికార పార్టీ నాయకులుగా అహాంభావంతో మహిళలను అగౌరపరిచేవిధంగా మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహాన్రెడ్డికి మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే ఆ నలుగురిని బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్యాదర్శి కె.రమేష్, కోశాధికారి పూర్ణ, సభ్యులు నాదెండ్ల, శ్రీను, భాస్కర్, శంకర్, చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు.