Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ జిల్లా నాయకులు సిహెచ్ కుమారి
నవతెలంగాణ-చింతకాని
మధ్యాహ్న భోజన కార్మికుల 3 నెలల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా కార్యదర్శి సిహెచ్ కుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చింతకాని సిపిఎం కార్యాలయంలో జరిగిన మధ్యాహ్న భోజన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన స్కీం నుండి తప్పుకోవాలని చూస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా, 3 నెలలు గడుస్తున్నా బిల్లులు ఇవ్వకుండా కార్మికులు ఎలా జీవించాలని అన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కనుగుణంగా మెనూ ధరను పెంచాలని, వంట గ్యాస్ సిలెండర్‌ను ఉచితంగా అందదజేయాలని, కనీసవేతనం రూ.19,000 ఇచ్చి, కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యేక పోరాటం చేస్తామన్నారు.అనంతరం ప్రదర్శనగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీడివో రవికుమార్ కు వినతి పత్రం అందజేసారు . ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పీ రమ్య ,సిఐటియూ జిల్లా నాయకులు మడిపల్లి గోపాలరావు , మండల కార్యదర్శి గడ్డం రమణ ,మధ్యాహ్న భోజన కార్మికులు ప్రమీల, పద్మ, లక్ష్మి, తలారి రాణి, రాధ చుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.