Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని ఎస్టీ బాలికల హాస్టల్‌ను సోమవారం మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు. హాస్టల్లో పారిశుధ్య వ్యవస్థ, మురుగు నీటి పారుదల, డ్రైనేజీలు పరిశీలించారు. అందుతున్న మెనూ గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు పిల్లలతో ముచ్చటిస్తూ వారితో కలిసి రాగిజావ తాగారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు మంచిగా చదువుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నారు. హాస్టల్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పిల్లలకు పౌష్టిక ఆహారం అందేలా చూస్తున్న హాస్టల్ వార్డెన్‌ను అభినందించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, స్థానిక వార్డ్ కౌన్సిలర్ వాంకుడోత్ తార పాల్గొన్నారు.