Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తూ అదనంగా మరో మూడు మండలాల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సున్నం సమ్మయ్య సేవలు అభినందనీయమని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. సోమవారం పర్ణశాల జిల్లా పరిషత్ హైస్కూల్లో పాఠశాలల సముదాయపు సమావేశం ప్రధానోపాధ్యాయురాలు మేరి శ్రీ అధ్యక్షతన జరిగింది. సమావేశం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఏజె ప్రభాకర్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తాళ్లూరి వంశీ మోహన్‌తో పాటు మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్యను కాంప్లెక్స్ పరిధిలోని అన్ని యాజమాన్యం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్రటరీ డి.శ్రీనివాసరావు, సీఆర్పీలు పాల్గొన్నారు.