Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దేశ రక్షణ పోరాటం మరింత ఉధృతం
అ నల్ల చట్టాల రద్దు పార్లమెంట్లో సాగాలి
అ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-భద్రాచలం
యావత్ భారతదేశం తన సొత్తు అన్నట్లుగా వ్యవహరిస్తూ పోతున్న ప్రధాని నరేంద్ర మోడీ పతనం మొదలైందని, ఏడాదిపాటు రైతులు నల్ల చట్టాల రద్దు కోసం చేసిన పోరాటంలో విజయం సాధించడమే నిదర్శనమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్లు పార్లమెంటు సాక్షిగా బిల్లు పెట్టి ప్రకటించే అంత వరకు పోరాటం ఆగదని ఆయన అన్నారు. మున్నా లక్ష్మి కుమారి అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం భద్రాచలం రాఘవ నిలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కూనంనేని మాట్లాడుతూ సుదీర్ఘ రైతు పోరాటం, సుప్రీంకోర్టు మొట్టికాయలు, లికంపూర్ ఘటన, ఉప ఎన్నికల ఫలితాలు రైతు వ్యతిరేక చట్టాలకు కారణమయ్యాయని చెప్పారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించే ఉద్దేశంతోనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారని చెప్పారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రైతు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మోసపూరిత మాటలతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. హుజురా బాద్ విజయాన్ని చూసి కమలదళం జబ్బలు చరుచుకుని ముమ్మాటికి తప్పేనని ఆ ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటెలగా సాగిందని గుర్తు చేశారు. కేసీఆర్ టక్కుటమార విద్యలతో మరోసారి రాష్ట్ర ప్రజానీకాన్ని మాయ చేసే పనిలోనే ఉన్నారనీ, ఇప్పుడు రైతుల వంతు వచ్చిందని చెప్పారు. రానున్నది మహాసభల కాలమని గ్రామగ్రామాన అరుణ పతాకం రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త ఓ ఎర్ర సైనికుడు కావాలని ఆయన కోరారు. జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ భాష కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టగా నాయకులు రావులపల్లి రామ్ ప్రసాద్, బొల్లోజు అయోధ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులుముత్యాల విశ్వనాధం, సారయ్య, సత్యనారాయణ, నర్సయ్య, శ్రీనివాస్ రెడ్డి, కమటం వెంకటేశ్వర రావు, సలీమ్, జిల్లా సమితి సభ్యులు, ప్రజా సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు పాల్గొన్నారు.