Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ పార్లమెంట్ సభ్యులు
మీడియం బాబురావు,
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోతినేని
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రైతుల ప్రాణ త్యాగాలతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను పార్లమెంటులో ఆమోదింప చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల పార్టీ 8వ మహాసభ ములక పాడు యలమంచిలి సీతారామయ్య భవన్ ఆవరణలోని అమరవీరుల ప్రాంగణంలో జరిగింది. ముందుగా పార్టీ జెండాను మీడియం బాబురావు ఎగురవేశారు. అనంతరం అమరులు మాజీ ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యతో పాటు పలువురు అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 8వ మండల మహాసభకు కొరస చిలకమ్మ, యలమంచి వంశీకృష్ణ, బొల్లి సూర్యచంద్రరావు అధ్యక్ష వర్గంగా జరిగిన మహాసభలో ప్రారంభ ఉపన్యాసం మీడియం, పోతినేని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత సంవత్సర కాలంగా కిసాన్ సంయుక్త ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉక్కు సంకల్పంతో చేపట్టారన్నారు. రైతు ఉద్యమాలు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సైతం వ్యాపించి రైతు ఉద్యమం దేశ చరిత్రలోనే మైలు రాయిగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వారిపై కేసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేసి ఉద్యమాన్ని అణిచి వేయాలని ఎన్నో కుట్రలు చేసిందన్నారు. సుమారు 750 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిం దన్నారు. ప్రధాని మోడీపై రైతులకు నమ్మకం లేదని పార్లమెంటులో నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించిందన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమాలకు సీపీఐ(ఎం) దాని అనుబంధ ప్రజా సంఘాలు తోడ్పాటు అందించాలని మహాసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. దీంతోపాటు కార్మికుల హక్కులను కాలరాసేలా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకూ ఉద్యమాలను కొనసాగించాలని మరో తీర్మానం ప్రవేశ పెట్టినట్లు వారు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అదనంగా వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర ప్రకటించాలని, పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని మహాసభ తీర్మానం చేసింది. మండల వ్యాప్తంగా 13 జోన్ల నుండి డెలిగేట్స్ పాల్గొన్న మండల మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, సరియం కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.