Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నాటి పనితనంతో నేడు పరిపాలన
అ స్వచ్ఛత, పచ్చదనం ఆ పల్లె సొంతం
నవతెలంగాణ-అశ్వారావుపేట
చిన్న అనుభవం ఎంతో అవగాహన కల్పిస్తుంది, ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. దీంతో వ్యక్తిత్వంలో నాణ్యత, పనితనంలో నైపుణ్యం పెరుగుతుంది. అందుకేనేమో పంచాతీలో గుమస్తా గిరి చేసిన వ్యక్తి తదనంతరం సర్పంచ్ కావడం ఆ అనుభవంతో పంచాయతీని తనదైన శైలిలో అభివృద్ధి చేస్తున్న వైనం ఇది.
మండల పరిధిలో గల ఊట్లపల్లి నుండి 2019లో పంచాయతీల పునర్విభజనలో ఏర్పాటు అయిన చిన్న పంచాయతీ కేసప్పగూడెం. 829 జనాభాతో, 453 ఓటర్లుతో 8 వార్డులుతో ఏర్పిడింది. ఈ పంచాయతీకి ఉమ్మడి ఊట్లపల్లి పంచాయతీలో గుమస్తా గిరి చేసిన కొమరం బాబురావు ప్రధమ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. డిగ్రీ వరకు చదివిన సర్పంచ్ ఆ పనితనంతో కొత్త పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. సుమారు 15 వీధులు ఉన్న ఈ గ్రామంలో ఏ వీధిలో మురికి కాలువ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ వీధికి ఇరువైపులా హరిత హారం పచ్చదనం మొక్కలు ఆహ్లాదాన్ని పెంచుతాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతి వనం, వైకుటదామం, డంపింగ్ యార్డులు వెళ్ళే మార్గం ఇరువైపులా మొక్కలు పెంచడంతో ఆ దారి ఎంతో హాయినిస్తుంది. పల్లెప్రకృతి వనం రకరకాల పూలతో కలకల్లాడుతుంది.
అయితే ఈ పంచాయతీ 5వ, వార్డు ఎస్సీకి కేటాయించగా ఆ సామాజిక వర్గం వాళ్ళూ ఎవరూ లేకపోవడంతో ఆ వార్డుకి ప్రజాప్రతినిధి లేకపోవడం కొసమెరుపు.