Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దమ్మపేట మండల గౌడ సంక్షేమ సంఘం
నవతెలంగాణ-దమ్మపేట
గౌడ కులంకు కేటాయించిన మంద్యం షాప్‌లపై నిర్వాహణ వారికే ఉండాలని గౌడ కుల పెద్దలు పానుగంటి సత్యం, నాయుడు చెన్నారావు, మిడతా లక్ష్మీనారాయణ, నాయుడు బాబురావు, యూత్ నాయకులు యార్లగడ్డ సూరి, కాసాని నాగప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం దమ్మపేట హెడ్ క్వార్టర్ పరిధిలో గల స్ధానిక గౌడ సంక్షేమ కార్యాలయంలో వారు మాట్లాడారు. గౌడ కులస్తులుకు ఇచ్చే మద్యం షాప్ 15 శాతం రిజర్వేషన్ మీద గాని లేదా వారికి షాప్‌ల కేటాయింపు మీద గాని ఒక నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించకుండా మోసం చేస్తున్నారన్నారు. మండలానికో మద్యం షాప్‌ను గౌడ కులస్తులకు కేటాయిస్తే ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్టు అని, ఇలా పోటి పెట్టి గౌడ్స్ని ఆర్ధికంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. గౌడ కులస్తుడుకి కేటాయించిన షాప్ మీద బినామిదారులు, సిండికేట్ వారు పదుల సంఖ్యలో టెండర్లు వేసి షాప్‌లు పొంది ఆ షాప్ మీద ఆజమాయిషీ చేద్దామని చూస్తున్నారు. ఖబాద్దర్ బినామిదార్లు ! అన్నారు. ఏ ఒక్క కులం నుంచైనా ప్రభుత్వానికి పన్ను రుపంలో డబ్బు వెళుతుందో లేదో గాని మా కులం నుండి ప్రతి ఏటా తాటి చెట్టు పన్ను కడుతూ ప్రభుత్వంకు ఆదాయం కల్పించడంలో మా గీత కార్మిక సొసైటీలు ముందుంటాయి అన్నారు. అలాంటి గీత కార్మిక సొసైటీలకు కూడా ఇచ్చిన 15శాతం రిజర్వేషన్లో స్ధానం లేకుండా చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు దమ్మపేటలో మద్యం షాప్‌లు అన్ని కలిసి మద్యంషాప్ లైసెన్స్‌కు విరుద్దంగా చేసే ''సిండికేట్ దందా, ఎంమ్మార్పిపై అధిక రేటు, హోల్‌సేల్ షాప్, షాప్ సమయపాలనలో చేసుకున్న మార్పులు లాంటివి ఉండవని పత్రిక ముఖంగా తెలియజేశారు.