Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశ్వారావుపేట ప్రధానమంత్రి సడక్ యోజన నిధులతో మండలంలో నూతనంగా నిర్మిస్తున్న రహదారుల నాణ్యతా ప్రమాణాలను స్టేట్ క్వాలిటీ మోనటరింగ్ బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించారు. రూ.3 కోట్లు పై చిలుకుతో మద్దికొండ నుండి మొద్దులగూడెం మద్య వ్యవసాయ క్షేత్రాలు మీదుగా 5 కిలో మీటర్లు మేర నూతనంగా నిర్మిస్తున్న రహదారిని రహదారుల నాణ్యతా ప్రమాణాల రాష్ట్ర నిర్వహణ బృందం ప్రధాన సభ్యులు ఎ.సాంబయ్య పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ రాజ్ డీఈ శ్రీనివాసరావు, ఏఈలు శ్రీధర్, తన్నీరు శ్రీనివాసరావు, వర్క్ ఇన్స్పెక్టర్ సిద్దాంతపు శ్యామ్లు ఉన్నారు.