Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనే
తన ఆశయానికి దాతల సాయమే
దారి చూపాలి
నవతెలంగాణ-గుండాల
చదువుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందుకు కుటుంబ నేపధ్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. తనకు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనే ధృడ సంకల్పం బలంగా ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో తన ఆశయం, తన కల నేరవేరదేమో! అని ఆందోళన చెందుతుంది. వివరాల్లోకి వెళితే...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలోని లింగగూడెం గ్రామ పంచాయతీలో గల చీమలగూడెం గ్రామానికి చెందిన కల్తి సమ్మయ్య, కళావతి దంపతుల కుమార్తె కల్తి భవానీ చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉంటూ చదువుకుంటుంది. ఒకటవ తరగతి నుండి ఏడోవ తరగతి వరకు స్వంత గ్రామం చీమలగూడెంలోని యూపీఎస్సీ పాఠశాలలో, ఎనిమిదో తరగతి నుండి పదొవ తరగతి వరకు సుదిమళ్ళ (ఇల్లందు)లోని గురుకుల పాఠశాలలో, ఇంటర్ వరంగల్ కాలేజీలో చదివింది. ఇంటర్ సెకండీయర్లో 955 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనే పట్టుదలతో నీట్ ఎగ్జామ్స్ రాసి 533 మార్కులతో ఆల్ ఇండియా లెవల్లో 58221వ ర్యాంకు ఎస్టీ కేటగిరీలో 335వ ర్యాంకు సాధించింది. స్టేట్ లెవల్లో 1059వ ర్యాంకు ఎస్టీ కేటగిరీలో 35వ ర్యాంకు సాధించింది. కానీ ఎంబీబీఎస్ చదవాలనే ఆ ఆదివాసి విద్యార్థిని కల నేరవేరేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారడంతో అయోమయ స్థితిలో ఉంది. గ్రామంలోని ఇరుగుపొరుగు వాళ్ళు చదువుల తల్లికి ఆర్థిక పరిస్థితులే అడ్డంకి, ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనే భవానీ ఆశయానికి దాతల సాయమే! దారి చూపాలి అని అనుకుంటున్నారు. తమ కూతురి చదువు కోసం ఏడాదికి లక్ష నుండి లక్షన్నర ఖర్చు అవుతుందని అది కూడా తమకు ఎల్లుబాటు కావడం లేదని తమ కూతురి డాక్టర్ కల నెరవేరాలంటే దాతలు సాయం చేసేందుకు ముందుకు రావాలని భవానీ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.