Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాస్థాయి కళాఉత్సవ్ పోటీలలో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో వారి ప్రతిభను ప్రదర్శించనున్నారని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు. గతనెల 31వ తేదీన జరిగిన పోటీలలో మంచి ప్రతిభ కనబరిచారు. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన ఓకల్ మ్యూజిక్, క్లాసికల్, శాస్త్రీయ నృత్యము పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ పోటీలు ఆన్లైన్ విధానంలో జరిగాయని తెలిపారు. ఓకల్ మ్యూజిక్ క్లాసికల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూలీలైన్కు చెందిన వై. యశశ్విని, శాస్త్రీయ నృత్యం అంశంలో నవభారత్ పబ్లిక్ పాఠశాల, పాల్వంచకు చెందిన గాయత్రి.ఎస్. మొండె పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు. బుధవారం జానపద నృత్యం అంశంలో చండ్రుగొండ కెజిబివి పాఠశాల నుండి బి.రేవతి, ఈ నెల 25న జరుగనున్న చిత్రలేఖనం పోటీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భద్రాచలంకు చెందిన పి.కార్తిక్ పాల్గొననున్నారని డీఈఓ తెలిపారు. ఈ పోటీలకు సమన్వయకర్తగా అకడమిక్ కో-ఆర్డినేటర్ నాగరాజశేఖర్ వ్యవహరించగా, సాంకేతిక సమన్వయ కర్తగా ఐఇ. కో-ఆర్డినేటర్ ఎస్.కె. సైదులు వ్యవహరించారు. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను డీఈఓ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి, జాతీయ స్థాయికి ఎంపికవ్వాలని ఆకాంక్షించారు.