Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
తన తల్లి చనిపోవడంతో గత మూడేండ్లుగా మనోవేదనకు గురై ఆ బాధను తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని ముసలిమడుగు వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్సై ఖాజా నసీరుద్దీన్ వెల్లడించారు. బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతమీపురం కాలనీకి చెందిన షేక్ షరీఫ్ పాషా (26) తన తల్లి గత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి చనిపోవడంతో నాటి నుంచి దిగాలుగా ఉంటూ తనలో తానే మనోవేదనకు గురయ్యేవాడు. సమయానికి అన్నం కూడా తినకుండా అదే ధ్యాసలో ఉంటూ మనస్థాపంతో గత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆదివారం వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి షేక్ పెద్దయాకూబ్ కుటుంబసభ్యులతో కలిసి వెతికారు.
మంగళవారం ఉదయం మండల పరిధిలోని ముసలిమడుగు డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో ఖాళీగా ఉన్న పొలాల్లో పురుగుమందు సేవించి విగతజీవుడై కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి అదనపు ఎస్సై ఖాజా నసీరుద్దీన్ చేరుకొని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.