Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 30 తేదీన సీఎం పీఎఫ్
కార్యాలయం, హెడ్ ఆఫీస్ ముందు ధర్నా
అ ధర్నాను విజయవంతం చేయండి
అ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
మందా నర్సింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్, రిటైర్డ్, కాంట్రాక్ట్ కార్మికుల 2018-19 నుండి ఇప్పటి వరకు 8.5 శాతం బదులుగా 8 శాతం కట్టడం వల్ల వేలాది రూపాయలు కార్మికులు నష్టపోయారని, సిపిఆర్ఎస్ కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన కొత్తగూడెంలోని సీఎం పిఎఫ్ కార్యాలయం, సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి మందా నర్సింహారావు పిలుపు నిచ్చారు. మంగళవారం సింగరేణి ఏరియాలోని జీకేఓసి, పద్మావతిఖని, రామవరం సెంట్రల్ ఆటో వర్క్ షాప్లో సిఐటియు ఆధ్వర్యంలో ఫిట్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా మంద నరసింహారావు మాట్లాడుతూ మినిమం పెన్షన్ రూ.10 వేలు పెంచాలని, 2018-19 నుండి 2020-21 వరకు పని చేస్తున్నా వారికి 8.5 శాతం బదులు 8 శాతం మాత్రమే చెల్లించారని ఈ తేడాను వెంటనే సరిచేసి కార్మికులకు చెల్లించాలన్నారు. రిటైర్డ్ కార్మికులకు మూడో తారీకులోపు చెల్లించాలని, సీఎంపీఎఫ్, పెన్షన్ లెక్కలు కోల్ ఇండియా వల్లే ఆన్లైన్లో పొందు పరచాలని, పీఎఫ్ అకౌంట్లేని కాంట్రాక్టు కార్మికులకు వెంటనే అకౌంట్ నెంబరు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ హెడ్ ఆఫీస్ వద్ద ఉదయం11 గంటలకు జరుగు ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సీపిఆర్ ఎంఎస్ మెడికల్ కార్డులు కార్మికులు దిగిపోయిన రోజే ఇవ్వాలని, కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులను నెలల తరబడి తిప్పకుండా సెటిల్మెంట్ చేయాలని, జేబిసిసిఐ అగ్రిమెంట్ ప్రకారం కోల్ ఇండియాలో వల్లే దిగిపోయిన కార్మికుల భార్య, భర్త లిద్ధరికీ ఒక్కొక్కరికీ రూ.25,000లు మెడికల్ రియంబర్స్ మెంట్ కింద ప్రతి సంవత్సరానికి పేమెంట్ చేయాలని, సీపిఆర్ ఎంఎస్ మొత్తంలో నుండి ఎంత ఖర్చు అయిందో, ఎంత బ్యాలెన్స్ వుందో ఆన్లైన్లో చూసుకునే సౌకర్యాన్ని కల్పించాలని, కొత్తగూడెం, గోదావరి ఖనిలో సీపిఆర్, ఎంఎస్సెల్ ఏర్పాటు చేయాలని కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇంకా తదితర సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు వై.వెంకటేశ్వరరావు, ఎలగొండ శ్రీరాంమూర్తి, సుదర్శన్, భూక్య రమేష్, పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.