Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే హరిప్రియకు ప్రిన్సిపల్ వరలక్ష్మి క్యాంపు కార్యాలయంలో మంగళశారం వినతి పత్రం సమర్పించారు. తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని దృష్టికి తీసుకెళ్ళారు. సమస్య పరిష్కరించాలని ఎంఎల్ఏ సానుకూలంగా స్పందించారు. సమస్యను త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.