Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పినపాక రైతులు వరి ధాన్యాన్ని పొలంలోనే ఆరబెట్టుకుని తేమ శాతం తగ్గిన తరువాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పినపాక సివిల్ సప్లయస్ డీటీ ముత్తయ్య అన్నారు. మంగళవారం బయ్యారం ఏఈఓ కొమరం లక్ష్మణ్ రావుతో కలిసి బయ్యారం, పోతిరెడ్డిపల్లిలో రైతుల ధాన్యాన్ని పరిశీలించారు. పలువురి రైతుల ధాన్యం తేమను పరిశీలించారు. ధాన్యం తేమ 17 శాతం మించి ఉండకూడదన్నారు. కార్యక్రమంలో సునీల్, రైతులు సీతారాం రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.