Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
సీతమ్మసాగర్ భూ సేకరణ నిర్వాసితులకు గ్రామసభ నిర్వహించినట్టు తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. మంగళవారం తిర్లాపురం గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో రెండవ విడత గ్రామసభ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ నిర్మాణంలో భాగంగా గ్రామసభ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. రామానుజవరం రెవెన్యూ పరిధిలోని గొర్రపేట వాగు గోదావరి నదిలో కలిసే ప్రాంతంలోని వాగుకు ఇరువైపులా ఉన్న అభ్యంతరాలను స్వీకరించామన్నారు. అనంతరం మాట్లాడుతూ త్వరలోనే భూ నిర్వాసితులకు అవార్డు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిర్లాపురం సర్పంచ్ పాయం కామరాజు, రామానుజవరం ఎంపీటీసీ పాయం లక్ష్మయ్య, సర్పంచ్ బాడిశ సతీష్, ఆర్ఐ రామయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.