Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-చర్ల
నా ఈ 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు పదవులపై వ్యామోహం పెంచుకోలేదని పార్టీ నిర్ణయానికి అన్ని వేళల విధేయుడై ఉన్నందునే అటు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలోనూ పదవులు వాటంతట అవే నన్ను వరించాయని, నాకు పదవులు ముఖ్యం కాదని పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని ఉభయ జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం మండల పర్యటనకు వచ్చిన బాలసాని ముఖ్య కార్యకర్తలతో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధును ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. టీఆర్ఎస్ రథసారధి కేసీఆర్ తీసుకున్న ఎటువంటి నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలందరం తప్పనిసరిగా తూచా తప్పకుండా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు గెలిచేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు సోయం రాజా రావు, శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బుచ్చయ్య, లంక రాజు, విశ్రాంత ఉపాధ్యాయులు, తాతారావు, పోలిన రామచంద్ర రావు, పంజా రాజు, వరప్రసాద్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, సర్పంచులు నాగేంద్ర ,పోడియం మురళి, ఉప సర్పంచ్ గోసుల మురళి, బ్రహ్మానంద రెడ్డి, కాకి అనిల్, టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
భద్రాచలం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖరరావు తీసుకున్న నిర్ణయానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కట్టుబడి ఉండాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ అన్నారు. మంగళవారం భద్రాచలంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాత మధును పార్టీ నిర్ణయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకటరావు మాట్లాడారు. ఈ సమావేశంలో చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య, మహిళ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు గంగ భారతి, మాదారి, మండల అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతిరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.