Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంలగాణ-కొత్తగూడెం
సోలార్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సమ్మెను చేస్తున్నారని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యన్. సంజీవ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఇఫ్య్టూ ఆద్వర్యంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్. నర్సింహారావు, సోలార్ ప్లాంట్ ఇన్ చార్జ్ రఘురామి రెడ్డి, సోలార్ జీఎం సూర్యనారాయణలకు సమ్మె నోటిస్ అందజేశారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ సింగరేణిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్లో పని చేస్తున్నటువంటి సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాక్ జీతాలు కుడా ఇవ్యటం లేదని అనారు. ఈ విషయల పై అనేకసార్లు సింగరేణి యాజమాన్యానికి, సంబంధిత ఆదానీ గ్రూప్ కాంట్రాక్టర్లకు పలుమార్లు లెటర్లు, ధర్నాలు చేసినప్పటికీ కార్మికుల పట్ల యాజమాన్యం, కాట్రాక్టర్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 25వ తేదీ బుధవారం నుండి సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగిందని, తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల సమ్మెలోకి వెళ్తామని సందర్భంగా హెచ్చరించారు. 25న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సోలార్ కార్మికులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇప్టూ ఏరియా అద్యక్షులు పి.సతీష్, కార్మికులు సత్యనారాయణ, అజరు, అనుదీప్ తదితరులు కార్మికులు పాల్గొన్నారు.