Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండలంలోని కేజీబీవీ పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ మండల మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బి.కిషోర్ సింగ్ అధ్యక్షత వహించారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా భానోత్ భాస్కర్ రావు, అధ్యక్షులుగా బీ.హనుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా జీ.కిరణ్ శ్రీనివాస్, రమాదేవి, కోశాధికారిగా సిహెచ్ నరసింహారావు, కార్యదర్శులుగా పి.పాపారావు, కాంతారావు, సునీత, జీ.పవన్, శ్రీనివాస్, మహిళా కన్వీనర్ బి.అనిత, సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎస్.లలిత, సాంస్కృతిక కమిటీ కన్వీనర్‌గా సిహెచ్ నరసింహారావులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.