Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
వరికల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ములకలపల్లిలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు తడిచి ముద్దయిన ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.2500 మద్దతు ధర తక్షణమే ఇవ్వాలన్నారు. తేమపేరుతో రైతుల నుంచి తారం వసూళ్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం రైతులకు టార్పాలిన్ పట్టాలు ఉచితంగా ఇవ్వాలని, రైతుపండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలన్నారు. వడ్డీపేరుతో రైతులను మోసం చేస్తున్న దళారులపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. రబీలో వరి పంట వేయొద్దని రైతులను హెచ్చరిస్తూ మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతితల్లి ప్రేమచూపుతు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, గొగ్గలు ఆదినారాయణ, పూకంటి రవికుమార్, నిమ్మల మధు, సోయం వీరాస్వామి, నాగేశ్వరరావు, కుంజా తదితరులు పాల్గొన్నారు.