Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పినపాక అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ విక్రమ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఈ బయ్యారం పెద్ద వాగు దగ్గరకు వెళ్లగా అక్కడ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఎన్నిసార్లు హెచ్చరించినా వినకపోతే పీడీ యాక్ట్ కేస్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.