Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సైబర్ కాంగ్రెస్ మీట్లో సీఐ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సాంకేతికత రోజురోజుకు అధికమవుతోందని అదే స్థాయిలో విద్యార్థినీలు, చిన్నారులపై సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకటేశ్వర్లు విద్యార్థులకు సూచించారు. మంగళవారం నర్సాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు కాంతారావు అధ్యక్షతన సైబర్ కాంగ్రెస్ మీట్ నిర్వహించారు. సైబర్ మెంటర్‌గా పాఠశాల ఉపాధ్యాయురాలు జె.పద్మ విద్యార్థులకు నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ అంబాసిడర్లుగా ఎంపికైన విద్యార్థులు హేమ ప్రియ, పి.పద్మావతిలను బ్యాడ్జిలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సీఐ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులపై నేరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ విద్యాసాగర్, మధుసూదన్‌తో పాటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : సమాజ రక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామిలు కావాలని షీ టీమ్ ఎస్ఐ రమాదేవి అన్నారు. మంగళవారం చాతకొండ హై స్కూల్లో సైబర్ కాంగ్రెస్‌పై హెచ్ఎం.మాధవరావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షీ టీమ్ ఎస్ రమాదేవి మాట్లాడారు. సైబర్ కాంగ్రెస్‌పై విద్యార్థులు, తల్లి, దండ్రులు, ప్రజలు అవగాహాన కలిగి ఉండాలని కోరారు. సై బర్ కాంగ్రెస్ అంబస్డర్స్గా వి.వైష్ణవి, ఎస్.సంజరులను నియమించారు. వారి చేత ప్రమానం చేయించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ పోలీసు షిరీషా, మెంటర్ వాణి, ఉపాద్యాయులు దేవదాసు, రాజు, భీమా, పద్మ, రాములు తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎస్ఐ జి.ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. బ్యాంకు అకౌంట్లు, ఏటీఎమ్, ఫోన్‌పే, వాట్సాప్, గూగుల్ పేల ద్వారా జరిగే మోసాలపై ప్రజలకు వివరించారు. యువత సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని ఎస్ఐ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
చండ్రుగొండ : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఎస్ఐ బి.రాజేష్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆబాసిడర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైన్స్ టెక్నాలజీని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మంజుశ్రీ, ట్రైనీ ఎస్ఐ స్వప్న కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : పాఠశాల విద్యార్ధుల్లో సైబర్ నేరాలపై సైబర్ కాంగ్రెస్ ద్వారా అవగాహన కల్పించడానికి పాఠశాల విద్యా, పోలీస్ శాఖ, యంగిస్థాన్ పౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమానికి సైబర్ ఎంబాసిడర్లుగా ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ, తరగతి విద్యార్ధిని విద్యార్ధులు అడపా హాసిని, వాడపల్లి అఖిల్‌లు మంగళవారం ఎస్ఐ చల్లా అరుణ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసారు. ప్రధానోపాద్యాయులు పత్తేపరపు రాంబాబు అధ్యక్షతన పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఈ విద్యార్ధులకు ఇన్వెస్టర్ సెర్మనీ (పెట్టుబడి వేడుక) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అరుణ బ్యాడ్జిలు ప్రధానం చేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీచర్ డి.శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో విద్యార్థులుకు సైబర్ మోసాలపై స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ అవగహన కల్పించారు. విద్యావ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కక్విత, మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, పాఠశాల చైర్మన్ విద్యార్థులు పాల్గొన్నారు.
భద్రాచలం : నన్నపనేని మోహన్ హైస్కూల్ నందు మంగళవారం సైబర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి కుమారి వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా పోలీసు శాఖ తరపున షీ టీం భద్రాచలం నుండి సీహెచ్ సరోజిని నాయుడు, ఆర్.హరిత హాజరైనారు. ఈ కార్యక్రమానికి సైబర్ కాంగ్రెస్ అంబాసిడర్లుగా తొమ్మిదో తరగతి నుండి, 8వ తరగతి నుండి ఇద్దరు విద్యార్థినీ విద్యార్థులను కె విశ్వజిత్, యం.నందినిలను పాఠశాల తరఫున సైబర్ అంబా సిడర్లుగా ఎంపిక చేశారు. సైబర్ అంబాసిడర్ బ్యాడ్జిలను ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో సైబర్ అంబాసిడర్లకు మెంటర్ టీచర్‌గా డీ.థావుర్య, వ్యవహరించారు. అదేవిధంగా సైబర్ అంబాసిడర్ బాధ్యతలను అందరికీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విధ్యార్థులు పాల్గొన్నారు.