Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
అక్రమంగా తరలిస్తున్న గంజాయి కేసులు ఐదుగులు నిందితులను ఆరెస్టుచేసి వారి నుండి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు తెలిపారు. గురువారం చుంచుపల్లి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న చుంచుపల్లి ఎస్ఐ బి.మహేష్ ఎంపి-09, సీఎస్-9620 నెంబర్ గల కారు, ఎంపి-41, జిఏ-1772 నంబర్ గల బొలోరో వాహనం అనుమానాస్పదంగా కనింపచాయని వాటిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా ఆందులో అక్రంగా గంజాయి తరలిస్తున్నారని తెలిపారు. వారిని అదుపులోకి తసుకుని విచారించారని తెలిపారు. వారి నుండి గంజాయిని 10 బస్తాల్లో ఉంచి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. చత్తీస్ఘడ్, ఆంధ్ర సరిహద్దు నుండి ఇరత ప్రాంతాలకు తరలిస్తున్నారని, స్వాధీనం చేసుకున్న గంజాయి 238 కేజీలని దాని విలువ సుమారు రూ.47,68,000లు అని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న మధ్యప్రదేష్ రాష్ట్రంకు చెందిన గోపాల శర్మ, జయదీప్, మాలవ్య రాజేష్, మనీష్ శర్మ, అభిషేక్ రాథోడ్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు అక్షరు, పాండే లు పరార్లో ఉన్నారని వివరించారు.ఈ విలేకర్ల సమావేశంలో సిఐ డి.గురుస్వామి, ఎస్ఐ బి.మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.