Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
వైద్యుడు పునర్జన్మను ఇస్తాడు అనే దానికి ఉదాహరణ డాక్టర్ కోట రాంబాబు. ఎన్నో విజయవంతమైన సర్జరీలు నిర్వహించి ఎంతోమందిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన మధిరలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రాంబాబు గురువారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ఒక మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. 50 సంవత్సరాల వయసు గల మహిళ తీవ్ర కడుపు నొప్పితో కె.వి.ఆర్ హాస్పిటల్కి రాగా ఆమెని పరీక్షించిన పెద్ద పేగు కొంచం బాగం పని చేయడం లేదనిచెప్పి, నాలుగు గంటల పాటు శ్రమించి దాదాపు 2 మీటర్ల పేగును తీసివేశారు. లక్షల్లో ఖర్చు అయ్యే ఆపరేషన్ని అతి తక్కువ ఖర్చుతో చేసి ఆమెని బతికించిన డా.కోట రాంబాబుకి వారి కుమారులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యులకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తూ మధిర నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న డాక్టర్ కోట రాంబాబు వంటి విజయవంతమైన ఆపరేషన్స్ నిర్వహించి ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని మధిర పట్టణ వాసులు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు.