Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మండల పరిధిలోని పూసుగూడెం, ములకలపల్లి, పాతగంగారం, జగన్నాధపురం తదితర గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, నర్సరీలతో పాటు డంపింగ్ యార్డులను డీఆర్డీఏ ఏపీడీ సుబ్రమణ్యం గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ సంరక్షించాలని సూచించారు. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేయాలన్నారు. అదేవిధంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలిగించేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీవో నాగేశ్వరరావు , ఎంపీవో లక్ష్మయ్య , ఏపీవో విజయలక్ష్మి , ఆయా గ్రామపంచాయతీల సర్పండ్లు, కార్యదర్శులు ఉన్నారు.