Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మండల కేంద్రమైన ఎర్రుపాలెం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని 292 మంది విద్యార్థులకు బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు గురువారం నిర్వహించారు. విద్యార్థులందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సరిత తెలిపారు. అనంతరం విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి శానిటైజర్ వాడాలని, మాస్కులు ధరించాలని ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు సలహాలను వైద్య సిబ్బంది అందించారు. కార్యక్రమంలో ఆయుర్వేదిక ఫార్మాసిస్ట్ శ్రీను, పాఠశాల సిబ్బంది రేణుక, రమాదేవి, నవిత, ప్రియాంక, జ్యోతి, రాధిక, జయంతి, కృష్ణవేణి, విజయలక్ష్మి, సులోచన, విద్యార్థులు పాల్గొన్నారు.