Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని సింగరాయపాలెం గ్రామానికి చెందిన సీపీఎం కార్యకర్త దేవా అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీపీఎం వైరా నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్గి క్రిష్ణలు దేవా మృతదేహంపై పార్టీ జెండా కప్పి నివాళుర్పించారు. గత రెండు సంవత్సరాలుగా ఫెరాలసిస్తో బాధపడుతున్న దేవా పదిహేను రోజుల క్రితం ఇంట్లో జారిపడటంతో కాలు విరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కాలుకి శస్త్రచికిత్స చేయించారు. తీవ్ర అస్వస్థతకు గురై రాత్రి మరణించాడు. దేవా తండ్రి కంకణాల చిన్న బిచ్చాలు సీపీఎం సీనియర్ నాయకుడిగా గ్రామంలో పార్టీకి కీలక వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా గ్రామానికి ఉపసర్పంచ్ గా ఐదుసంవత్సరాలు పనిచేసాడు. నివాళుర్పించిన వారిలో మండల కమిటీ సభ్యులు దోడ్డపనేని క్రిష్ణార్జున్ రావు, మిద్దె రామారావు గాదె వెంకటరెడ్డి తీగల వెంకటి టీఆరెస్ నాయకులు కంకణాల వెంకటి న్యూడెమోక్రసీ వైరా కల్లూరు డివిజన్ నాయకులు షేక్ ఖాసీం మేడీ కొండల్రావు పాల్గొన్నారు.