Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
డిసెంబర్ ఐదో తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ముడుసు జాకబ్ ప్రతాప్ కోరారు. గురువారం చింతకానిలో మాలమహానాడు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఐదో తారీకు జరగబోయే ధర్నాను మండలంలో ఉన్న మాలలు వేలాదిగా తరలిరావాలని కోరారు. అనంతరం మాలమహానాడు మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది . మాలమహానాడు మండల అధ్యక్షుడిగా గంటల కిరణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడుగా దామల రవి, కార్యదర్శిగా పెరుమలపల్లి పెద్ద లింగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పట్టేటి గోపయ్య, జిల్లా నాయకులు కొర్లపాటి నాగరాజు, వనం చిన్నప్ప, మద్దెల రవీందర్, ఖమ్మం నగర అధ్యక్షులు నాగరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.