Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
బీరోలు గ్రామంలో వివిధ కారణాలతో మృతిచెందిన 21 కుటుంబాలకు పాలేరు ఎంఎల్ఏ కందాళ ఉపేందర్‌రెడ్డి ఆర్థికసాయం అందజేశారు. రైతు బంధు సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ చేతుల మీదుగా గురువారం ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.కార్యక్రమంలో సర్పంచ్ వంచర్ల అలివెలమ్మ- సత్యనారాయణ, ఎంపిటిసి ఏనుగుల మాలతి - శ్రీధర్, నాయకులు కొప్పుల శ్రీనివాస్‌రెడ్డి, షేక్ జాని బాబు, లింగమల్ల. ఇసాక్, మట్టపల్లి చంద్రారెడ్డి, కొక్కొరేణీ ఎంపిటిసి అంబేడ్కర్, కొక్కొరేణీ ఉపసర్పంచ్ సిరిగద్దె ఉపేందర్ పాల్గొన్నారు.