Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
ఈ ఏడాది మిర్చి రైతులు నిలువునా మునిగారు. మిర్చి పంటకు జెమినీ వైరస్, ఎండు తెగులు, కొమ్మ కుళ్ళు తెగులు, పై ముడత వంటి తెగుళ్ళ సోకాయి. మండలంలో 22 గ్రామాల్లో ఈ ఏడాది 2996 ఎకరాలలో మిర్చి పంటను అన్నదాతలు సాగుచేశారు. మిర్చి పంటను సాగు చేసిన దగ్గర నుంచి వరుసగా తుఫాను ప్రభావంతో అనేక దఫాలుగా వర్షాలు వచ్చాయి. ఆ సమయంలోనే అన్నదాత మిర్చి పంట సాగుచేశారు. ఒక ఎకరానికి 70 వేల నుంచి 90 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రైతులు ఎన్నో ఆశలతో మిర్చి పంటను సాగుచేశారు. కానీ అకాల వర్షాలు, వాతావరణ ప్రభావం, విత్తనాల నాణ్యత ప్రమాణాలు లేకపోవటంతో మిర్చి మిర్చి పంటకు వైరసులు విపరీతంగా సోకాయి. దీనివలన పంట పెరగకుండా దెబ్బతిని పోతుంది. 2,996 ఎకరాలకు గాను అన్నదాత లో 22 కోట్ల నుంచి 26 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. ఒక ఎకరానికి 70 వేల నుంచి 90 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు అన్నదాతలు తెలిపారు. మిర్చి మిర్చి పంటకు మంచి గిట్టుబాటు ధర ఉంటుందనే ఉద్దేశంతో సాగు చేశామని, కానీ వైరస్ వల్ల పంట ఇప్పటికే 80 శాతం వరకు దెబ్బతిన్నదని మండల అన్నదాతలు అంటున్నారు. మండలంలో సాగుచేసిన అన్ని గ్రామాలలో మిర్చి పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ ఏడాది ప్రధానంగా జెమిని వైరస్, ఎండు తెగులు, కొమ్మ కుళ్ళు తెగులు విపరీతంగా వ్యాపించాయని, దీనివలనే ఆశించిన స్థాయిలో అంట లేకుండా పోయింద న్నారు. ఈ తెగులు వల్ల దాదాపు దెబ్బతింటుందని చేతికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. మిర్చి పంట దెబ్బతిన్న విషయాన్ని అన్ని గ్రామాలలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మధిర ఉద్యానవన శాఖ అధికారి ఆకుల వేణు మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్బూరి శరత్ బాబు మండలంలోనే ఇప్పటికే అనేక గ్రామాల్లో దెబ్బతిన్న మిర్చి పంట పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు అనేక సూచనలు చేశారు. ఈ సూచనలు పాటించినా పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వరి పంట సాగు చేయమని చెప్పి ప్రస్తుతం పంట కొనుగోలు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతు న్నాయని దీనివలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా ఉండవలసిన ప్రభుత్వాలు రైతులకు నష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఏ పంట సాగు చేయాలి అయోమయ పరిస్థితి రైతుల లో నెలకొని ఉందని పలువురు రైతులు అంటున్నారు.
3 ఎకరాల్లో మిర్చి సాగు చేశా:
నిమ్మ తోట ఖానా, రైతు చిరునోముల
తాను మూడు ఎకరాలను ఎకరం 25 వేల చొప్పున కౌలుకు తీసుకున్నాను. ఇప్పటికే మూడు ఎకరాలకు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను. ఆయన పంట పరిస్థితి ఆశాజనకంగా లేదు. వివిధ రకాల వైరస్లు సోకాయి. పంట ఇప్పటికే దాదాపు 80 శాతం వరకు దెబ్బతిన్నది. మూడు ఎకరాలకు గాను కౌలు తో ఇప్పటికే రెండు లక్షల 75 వేల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. ఈ ఏడాది మిర్చి పంట ఆశాజనకంగా ఉంటుందని ఉద్దేశంతో సాగు చేసి నష్టపోతున్నాను.
లక్షా 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టా :
వరుగు నరసింహారావు, రైతు బోనకల్
తాను రెండు ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశాను. రెండు ఎకరాల గాను ఇప్పటికే ఒక లక్షా 50 వేల రూపాయల పెట్టుబడి పెట్టాను. కానీ పంట మాత్రం వివిధ రకాల వైరస్ సోకి దెబ్బతిన్నది. కనీసం 20 శాతం పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిర్చి పంటను సాగు చేసి తాను తీవ్రంగా నష్ట పోయాను ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు.