Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూ సమస్య పరిష్కారంపై హామీ ఏమైంది..?
కూసుమంచి తహశీల్దార్ కు దరఖాస్తు
నవతెలంగాణ-కూసుమంచి
మండల పరిధిలోని పెరికసింగారంలో ప్రభుత్వ భూమికి హద్దులు పెట్టి పేదలకు ఇండ్లస్థలాలు ఇస్తామని కూసుమంచి ఆర్.ఐ వసిం రూ.30వేలతోపాటు రెండు గొర్రెపోతులు లంచం తీసుకుని మోసం చేశాడని ఈ నెల 18న కూసుమంచి తహశీల్దార్ శిరీషకి బాధితులతో కలిసి ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం ఇచ్చిన విషయం విధితమే. వెంటనే ఆర్ఐపై చర్యలు తీసుకుంటామని, అట్టి భూమిలో ప్రభుత్వ బోర్డు పెడతామని ఆమె హామీ ఇచ్చిన విషయంపై గురువారం మళ్లీ తహశీల్దార్‌కు ఇచ్చిన హామీ ఏమైంది.. అవినీతి ఆర్ఐపై చర్యలు ఏవి మేడం అని వినతి ఇచ్చారు. దీనిపై తహశీల్దార్ పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాము. మరో వారం రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకొవాలని, లేనిచో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బాదితుల తరుపున వినతి ఇచ్చిన వారిలో పెదవీటి రామిరెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బారి.మల్సూర్, గిరిజన సంఘం కార్యదర్శి మూడు.గన్యానాయక్, సీఐటియు జిల్లా కమిటీ సభ్యులు గోపె.వినరు కుమార్, ఆవాజ్ నాయకులు మోహినుద్దిన్, మండల కమిటీ సభ్యులు ఉల్లోజు కర్ణబాబు, శీలం జానయ్య, కొరట్ల పాపయ్య పాల్గొన్నారు.