Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
గత పదేళ్లుగా మాధారంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేస్తుండగా ఈ ఏడాది అధికారుల మధ్య సమన్వయ లోపంతో కేంద్రం మార్పు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కునుసోత్ ధర్మ ఆరోపించారు. గురువారం ఆయన మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వ్యవసాయశాఖ అధికారులు, ములకలపల్లి పాసైటీ ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టి అధికారికంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని, అక్కడ కొనుగోలు చేయకుండా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరోచోట కొనుగోలు చేస్తామని, లేకపోతే మీ ధాన్యం కొనబోమని అధికారులు అనడం శోచనీయమన్నారు. రైతులను ఆదుకునేందుకు పనిచేసే అధికారుల మధ్య సమన్వయలోపం లేక రైతులను గందరగోళానికి గురిచేయడం ద్వారా దళారీ వ్యవస్థను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుందని మండిపడ్డారు. ఇప్పటికే యార్డులో 10 లారీల ధాన్యం ఉందని, మరో పది లారీల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, సొసైటీ నిర్వాహకులు కొనుగోళ్లను ప్రారంభించాలన్నారు. రైతు సంఘం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, మండల నాయకులు వి.రవి, చంద్రశేఖర్, స్థానిక రైతులు పాల్గొన్నారు.