Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఆర్డీవో పీడీ మధుసూదన్ రాజు
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
పల్లెప్రకతి వనాలు, పంచాయతీల్లో రహదారుల వెంబడి నాటిన ప్రతి మొక్క బతికేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని డీఆర్డీవో మధుసూదన్ రాజు అన్నారు. గురువారం బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర్, నాగినేనిప్రోలురెడ్డిపాలెం, సారపాక పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన డీపీవో లక్ష్మీ రమాకాంత్తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కల సంరక్షణపై పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం బూర్గంపాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించి పారిశుధ్యం, డంపింగ్ యార్డు నిర్వహణపై తగిన సూచనలు చేశారు. పంచాయతీల్లో పారిశుధ్యాన్నిఎప్పటి కప్పుడు పరిరక్షించాలని, డంపింగ్ యార్డుల వద్ద చెత్తను సేకరించి వేరుచేయడం వంటి కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాల న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వివేక్ రామ్ , ఎంపీవో సునీల్ కుమార్, సర్పంచ్ దివ్యశ్రీ, ఏపీవో శ్రీలక్ష్మి, సారపాక ఈవో కంది మహేష్, ఆయా పంచాయతీల కార్యదర్శులు , ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.