Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రంలోని నిరుద్యోగ మైనార్టీల కొరకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ వారు హైదరాబాద్ నందు ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా గురువారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో వెలువడనున్న ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసిన వారందరికీ 60 రోజులపాటు ఉచిత శిక్షణ అందిస్తారని ఆసక్తి గల వారు డైరెక్టర్ తెలంగాణ స్టేట్ మైనారిటీస్ స్టడీ సర్కిల్ జామియా నిజామియా కాంప్లెక్స్ 3వ అంతస్తులో గల గన్ ఫౌండ్రి హైదరాబాద్. అనే చిరునామాకు డిసెంబర్ 4వ తేదిలోపు నేరుగా గాని రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని అభ్యర్థులు తమ వివరాలను పంపించాలని ఇతర సమాచారం కొరకు 040-23236112 అనే నెంబర్కు సంప్రదించాలని కోరారు. కావున ఇటువంటి విలువైన అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగ సాధనే లక్ష్మంగా ముందుకు సాగాలని కోరారు.