Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పీడీఎస్యు, పీవైఎల్
నవతెలంగాణ-గుండాల
స్త్రీలపై జరిగే లైంగిక వేధింపులు, హింస, అణచివేతలను వ్యతిరేకిస్తూ ఈ నెల 27న ఇల్లందులో గల ఐతా ఫంక్షన్ హాలులో జరిగే సెమినార్ను జయప్రదం చేయాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాంపాటి పృథ్వి, పీవైఎల్ రాష్ట్ర నాయకులు వాంకుడోత్ అజరు అన్నారు. ఈ విషయమై గురువారం మండల కేంద్రంలోని ఇంటర్ కాలేజీలో విద్యార్థులతో కలిసి కరపత్రం విడుదల చేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల విద్యార్థి యువజన సంఘం కొత్తగూడెం డివిజన్ నాయకులు యనగంటి గణేష్, ఈసం కృష్ణ, కోడూరి జగన్, అలైక్య, లావణ్య, రిషిత శ్రీ, వంశి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.