Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థలో టీబీజీకేఎస్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చిందిని, దానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కారద్యదర్శి మందా నర్సింహారావు తెలిపారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా సింగరేణిలో గెలిచిన సంఘం అన్ని సంఘాలను కలుపుకొని ఈ డిమాండ్ల సాధనతో పాటు ఇంకా మరికొన్ని డిమాండ్లను కూడా చేర్చి అన్ని సంఘాల మద్దతును కూడగట్టి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. తద్వారా సింగరేణి సంస్థ మనుగడ కొరకు, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
సిఐటియూ చేర్చాల్సిన డిమాండ్లు
మైన్ యాక్సిడెంట్లో ఎస్ఆర్పి-3లో చనిపోయిన కార్మికులకు కోటి రూపాయల అదనపు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ రూ.13వేల కోట్లను వెంటనే ఇచ్చి సింగరేణిని ఆదుకోవాలని, సొంత ఇంటి కల నెరవేర్చటం కొరకు 250 గజాల స్థలం ఒక కుటుంబానికి, ఎవరు నివసిస్తున్న క్వార్టర్ వారికే కేటాయించాలని, 50 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి సింగిల్ బెడ్ రూమ్ లను డబుల్ బెడ్ రూమ్ గా మార్పు చేయాలని, జెబిసిసిఐ అగ్రిమెంట్లు సింగరేణిలో అమలు కాని అంశాలపై ఒత్తిడి చేయాలని, వాటిలో ప్రధానంగా పెర్క్స్‌పై ఇన్‌కంటాక్స్, వివిధ క్యాడర్ స్కీములు, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కమిటీ వేతనాలు, కరోణాతో గానీ యాక్సిడెంట్లో గాని మరణించిన వారికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, దిగిపోయిన వారికి మెడికల్ స్కీమ్ కింద చెల్లించాల్సిన ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మెడికల్ రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, డిస్మిస్ కార్మికులను ఒకే దఫాగా మిగిలిన వారిని తీసుకోవటం తదితర డిమాండ్లను కూడా చేర్చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియుగా కోరుతున్నట్లు మంద నరసింహారావు స్పష్టం చేశారు.