Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పెండింగ్ జీతాలు ఇచ్చేందుకు అంగీకారం
అ ఇఫ్య్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. సంజీవ్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఇఫ్య్టూ) ఆధ్వర్యంలో సోలార్ కార్మికుల పెండింగ్ జీతాల కోసం గురువారం ఫస్ట్ షిఫ్ట్ నుంచి సమ్మెను సోలార్ ప్లాంట్ల వద్ద నిర్వహించడం జరిగింది. ఉదయం షిఫ్ట్లను బంద్ చేయడం జరిగింది. ఆధాని సోలార్ ప్లాంట్ కాంట్రాక్టర్ గ్రూప్ ఆఫ్ తరఫున నాయుడు సోలార్, కాంట్రాక్టర్ సుందర్ రాజు ఇఫ్టూ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. సంజీవ్, పి.సతీష్, సమ్మె చేస్తున్న ప్లాంట్ వద్ద కార్మికుల సమక్షంలో చర్చలు జరిపారు. పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనికి కార్మికుల అంగీకారం మేరకు నాయకులు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నాయకులు యన్.సంజీవ్, పి.సతీష్ మాట్లాడుతూ వేతన బకాయిలు పాత పద్ధతిలోనే జీతాలు ఇచ్చారని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సోలార్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులకు చట్టపరమై నహాక్కులు, సౌకర్యాలు అమలు చేయాలని, కనీస వేతనాలు జీఓ ప్రకారం జీతాలు బ్యాంకు ద్వారా ఇచ్చే విధంగా సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల సత్యనా రాయణ, అజరు, శివ, శ్రావణ్, అనుదిప్, కార్తిక్, పవన్, వంశీ తదితరులు పాల్గొనారు.