Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను
భర్తీ చేయాలి
అ టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి చావా రవి
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెలంగాణ రాష్ట్ర యూటి ఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి ఆరోపించారు. గురువారం భద్రాచలంలోని యూటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారిందని , గ్రామ పంచాయతీలో పనిచేసే శానిటేషన్ సిబ్బందితో పని చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటం మానుకోవాలని అన్నారు. మున్సిపాలిటీ లలో, గ్రామ పంచాయతీలలో పని చేసే వర్కర్స్ అక్కడ పని చేయడంతోనే సరిపోతుందని, ఇక ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య పనులు ఎలా నిర్వహిస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న విద్యావలంటీర్లను తక్షణమే నియమిం చాలని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైస్కూల్లో 1550 హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 8500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ పోస్టులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా28వ తారీకు న భద్రాచలంలో జరిగే జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టియస్ యూటియఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజు, జిల్లా కార్యదర్శులు స్వర్ణ జ్యోతి, తావుర్య, యుటిఎఫ్ భద్రాచలం మండల అధ్యక్షులు జె.శ్రీను తదితరులు పాల్గొన్నారు.