Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పినపాక మండల రైతులు అధిక లాభాలను ఆర్జించే వాణిజ్య పంటలు సాగు చేయాలని బయ్యా రం వ్యవసాయ విస్తరణ శాఖ అధికారి కొమరం లక్ష్మణరావు అన్నారు. సోమవారం మండలం లోని బయ్యారం గ్రామంలో స్థానిక రైతులు పుల్లెపు భాస్కర్ రావు రెండున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ఒకే పంటను కాకుండా, వివిధ రకాల పంటలను సాగు చేయాలని అన్నారు. జిల్లాలో వివిధ మండలా ల్లో ఇప్పటికే రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారని, బయ్యారం లోనూ రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఒక ఎకరం విస్తీర్ణంలో 500 స్తంభాలను, రెండువేల డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో సాగు చేయడానికి రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందన్నారు. సాగులో సందేహాల నివత్తి కోసం మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.