Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎస్సీడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణిలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేత నం చెల్లించేందుకు యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలని ఎస్ఎస్సీడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి కొండపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయవలసి ఉందని, కోల్ ఇండియాలో అమలు జరుగుతున్న వేతనాలను సింగరేణిలో అమలు చేయకుండా యాజమాన్యం మొండికేయటం వల్ల ఎనిమిదేండ్లుగా 35 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. జేబీసీసీఐలో జరిగిన వేతన ఒప్పందాలు, నిర్ణయాలను సింగరేణిలో అమలు చేయకపోవటం అన్యాయం అయిందని పేద కార్మికులకు తీరని నష్టకరణమైందని అన్నారు.
గుర్తింపు సంఘం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక సంఘాలుగాని కాంట్రాక్టు కార్మికుల హైపవర్ కమిటీ వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయి ంచేందుకు పూనుకోకపోవడం విచారకరమైనదని అన్నారు. కాంట్రాక్ట్ కార్మి కులకు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమమే శరణ్యమని అందుకు సిద్ధం కావాలని కాంట్రాక్ట్ కార్మికులకు కొండపల్లి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మహేందర్, వినరు, శివ, అశోక్, సాయి, కోటి తదితరులు పాల్గొన్నారు.