Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్‌ను సోమవారం మండల కేంద్రంలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భద్రాచలం రాముల వారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో అశ్వాపురంలో ఆయన ఓ ఐదు నిమిషాల పాటు ఎన్‌హెచ్‌డీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా యూత్ అధ్యక్షులు గొల్లపల్లి నరేష్ మాదిగ నాయకులు చుంచు ప్రవీణ్ మాదిగ, మహిళా విభాగం అధ్యక్షురాలు గద్దల ఆది లక్మి మాదిగ, కొమ్ము వీర్రాజు మాదిగ, కాశిపోగు ప్రవీణ్ మాదిగ, కొప్పుల ఆదిత్య మాదిగ, ఈసంపల్లి జంపయ్య మాదిగ, శివకుమార్ మాదిగ, చుంచు విజరు వెంకటేశ్వర్లు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.