Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
విశ్రాంత సింగరేణీయుల కోసం జారీ చేసిన ఆరోగ్య కార్డుల (సీపీఆర్ఎంఎస్-ఎన్ఈ మెడికల్ కార్డుల) కాల పరిమితి ప్రతి ఏటా డిసెంబరు 31వ తేదీతో ముగుస్తుందని జీఎం (పర్సనల్) వెల్ఫేర్, సీఎస్ఆర్ కె.బసవయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సీపీఆర్ఎంఎస్ కార్డులు పొందిన ప్రతి ఒక్కరూ తమ కార్డు కాలపరిమితిని వచ్చే ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగించుకునేందుకు వెంటనే నిర్దేశిత నమూనాలో సవరించిన లైఫ్ సర్టిఫికేట్ను నింపి, అధీకృత అధికారి ద్వారా సంతకం చేయించి సమీపంలోని జీఎం ఆఫీసులోని ఏటీబీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డిసెంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు అన్ని ఏరియాల ఏటీబీ కార్యాలయాల్లో, ఈ మెయిల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లను స్వీకరిస్తున్నట్లు వివరించారు. విశ్రాంత ఉద్యోగుల సౌకర్యార్థం మూడు పద్ధతుల్లో లైఫ్ సర్టిఫికేట్లను స్వీకరిస్తున్నట్లు వివరించారు. సవరించబడిన లైఫ్ సర్టిఫికేట్ నమూనా కాపీని, ఏటీబీ కార్యాలయాల మెయిల్ ఐడీల వివరాలను సింగరేణి వెబ్ సైట్లో సర్టిఫికేట్ సమర్పించాలని కోరారు.