Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అప్పారావు
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
ఆశా వర్కర్లకు పెంచిన జీతాలు తక్షణమే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అప్పారావు అన్నారు. సోమవారం జగన్నాధపురంలో ఆశా వర్కర్ల జనరల్ బాడీ సమావేశం మండల అధ్యక్షురాలు అరుణబారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితమే వేతనాల పెంపు నిర్ణయం పారితోషకాలు కాకుండా ఫిక్స్డ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలని, లేదంటే ప్రతిఘటిస్తామన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించిన విధంగా డిసెంబర్ నెలలో ఆశా వర్కర్లకు రూ.9,750 జీవోను వెంటనే విడుదల చేసి ఆశ వర్కర్ల బ్యాంక్ ఖాతాలో వేయాలన్నారు. అనంతరం అప్పారావు కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ఆశా కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందని, వారి శ్రమను దోపిడీ చేస్తుందని వారు ఆరోపించారు. ఈ జనరల్ బాడీలో పాల్వంచ పట్టణ మండల కన్వీనర్ గూడెపూరి రాజు, ఆశా యూనియన్ మండల కార్యదర్శి సత్యాల రమణ, సబ్ సెంటర్ లీడర్స్ కొండమ్మ, సువార్త, మరియమ్మ, జ్యోతి, రమాదేవి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.