Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
11వ వేజ్ బోర్డులో బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 1వ కేటగిరీపై వేతన ఒప్పందం చేయాలని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి కార్మికులను కోరారు. సోమవారం కేసీహెచ్పీ, సివిల్, వీపీఆర్ఓబి, రోడ్డు క్లీనింగ్, లోడింగ్ అన్ లోడింగ్ తదితర విభాగాల్లో జరిగిన మీటింగులలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికుల వేతన ఒప్పందం కోసం నవంబర్ 15న రెండవ దఫా జేబీసీసీఐ చర్చలు న్యూఢిల్లీలో ఉంటాయని కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించిందని అన్నారు. బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 11వ వేజ్ బోర్డులో 1వ కేటగిరి వేతన ఒప్పందం చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో చలో న్యూఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు వి.జానయ్య, బ్రాంచ్ నాయకులు ఎండీ గౌస్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, నాగరాజు, సంజీవరెడ్డి, నరసింహారావు, వీరబాబు, ఎల్లమ్మ, అనసూర్య, కృష్ణవేణి, స్వరూప పాల్గొన్నారు.