Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని గుట్టమల్లారం గ్రామ పంచాయతీలోని కేసీఆర్ నగర్లో నివాసం ఉంటున్న కనుకు కమల, నరేష్ దంపతులు ఇల్లు శుక్రవారం విద్యుద్ఘాతంతో పూర్తిగా కాలిబూడిద అయింది. సోమవారం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్సికెఎస్), సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎస్సీఈయూ) ఆధ్వర్యంలో రూ.6000, 70 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందజేేశారు. అనంతరం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బండిరాజేష్ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వెంటనే నిర్మించాలని, వారి కూతురు లక్ష్మి ప్రసన్నకి పుట్టినప్పుటి నుండి మధుమేహ వ్యాధి ఉంది కావున ప్రభుత్వం వీరికి అవసరమైన నష్టపరిహారం చెల్లించా లని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గద్దల శ్రీనివాసరావు, వెంకన్న, మునిగెల శివప్రశాంత్, వెంకట్రావు, శ్రీను, భాదిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.