Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రత్నాకరం కోటం రాజు
నవతెలంగాణ-భద్రాచలం
నండూరి ప్రసాదరావు ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రత్నాకరం కోటం రాజు అన్నారు. భద్రాచం సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులలో ఒకరైనా కామ్రేడ్ నండూరి ప్రసాదరావు 31వ వర్ధంతి సీఐటీయూ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కోటంరాజు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రసాద్ రావు రాష్ట్ర కార్మిక ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని ఆయన అన్నారు. పాలక వర్గాలను ఎండగట్టడంలో ఆయన దిట్ట అని ఆయన అన్నారు. నిరంతరం పేద ప్రజల కోసం కార్మికవర్గం కోసం చివరి వరకు పోరాటాలు నిర్వహించారని ఆయన అన్నారు. అనేక సూచనలు, సలహాల ఇచ్చేవారని పత్రికల్లో అనేక వ్యాసాలు, పుస్తకాల ద్వారా కార్మిక వర్గాన్ని చైతన్య పరిచారని, అటువంటి నాయకుడు 21వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి, జిల్లా సహాయ కార్యదర్శి పట్టణ కన్వీనర్ వై.వి.రామారావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, నాయకులు ఎన్.నాగరాజు, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, ఎం.రేణుక, బి.వెంకట రెడ్డి, పి.సంతోష్, లక్ష్మణ్, జ్యోతి, లీలావతి, తదితరులు పాల్గొన్నారు.