Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పోడు కొట్టి సాగుచేసుకుంటున్న గిరిజన రైతులందరికీ భూ యాజమాన్యపు హక్కులు కల్పించేలా అధికార్యులు చర్యలు చేపట్టాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య రెవెన్యూ, ఫారెస్టు అధికారులకు సూచించారు. సోమవారం ఆయన గౌరవరం గ్రామంలో ఫారెస్టు అధికారులకు, గ్రామస్తులకు మద్య వివాదంలో ఉన్న పోడు భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన పోడు రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా పోడు సాగుదారులు మాట్లాడుతూ తాము 2002 నుండి పోడు కొట్టి భూములు సాగు చేసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు 2019లో బలవంతగా మొక్కలు నాటారని తాము మొక్కలు పీకేశామని ఆ సమయంలో అటవీ శాఖ అధికారులు తమపై కేసులు పెట్టారని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ కమిటీ ఎఫ్ఆర్సీ కమిటీలు పోడు రైతులకు అనుకూలంగా తీర్మాణాలు అధికారులు, ప్రజల సహకారంతో భూ యాజమాన్యపు హక్కులు పొందే విదంగా ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా ఆయన గౌరవరం గ్రామంలో మొక్కను నాటారు. ఆయన వెంట గౌరవరం సర్పంచ్ సోడి జ్యోతి, రేంజి అధికారి పి.కనకమ్మ, ఆర్ఐ ఆదినారాయణ, పర్ణశాల సెక్షన్ ఆఫీసర్ సృజన్ కుమార్, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, మండల అధ్యక్షులు లంకా శ్రీనివాసరావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, నాయకులు దర్శి సాంబశివరావు, వెంకటరమణారెడ్డి, పోడు రైతులు ఉన్నారు.