Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్షన్, సీఎం పీఎఫ్, సీపీఆర్ఎస్ మెడికల్
- స్కీం సమస్యల పరిష్కరించాలి
- ధర్నాను విజయవంతం చేయండి : సీఐటీయూ
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్, రిటైర్డ్, కాంట్రాక్ట్ కార్మికుల 2018-19 నుండి ఇప్పటి వరకు 8.5 శాతం బదులుగా 8 శాతం వడ్డీ కట్టడం వల్ల కార్మికులు ఎక్కువ మొత్తంలో నష్టపోయారని, సీపీఆర్ఎస్ కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఆందోళన భాగంగా నవంబర్ 30 తేదీన మంగళవారం కొత్తగూడెం సీఎంపిఎఫ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ కార్మికులకు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. మినిమం పెన్షన్ రూ.10 వేలకుపెంచాలని, 2018- 19 నుండి 2020-21 వరకు పని చేస్తున్నా వారికి 8.5 శాతం బదులు 8 శాతం వడ్డీ మాత్రమే చెల్లించారని ఈ తేడాను వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ కార్మికులకు మూడో తారీకు లోపు పెన్షన్ చెల్లించాలన్నారు. సిఎంపిఎఫ్, పెన్షన్ లెక్కలు కోల్ ఇండియా వల్లే ఆన్లైన్ళక్ష పెట్టాలని, పిఎఫ్ అకౌంట్ లేని కాంట్రాక్టు కార్మికులకు వెంటనే అకౌంట్ నెంబరు కేటాయించాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై మంగళవారం ఉదయం 9గంటలకు జరుగు ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నాలని పిలుపు నిచ్చారు. అదేవిధంగా హెడ్ ఆఫీస్ వద్ద ఉదయం11 గంటలకు జరుగు ధర్నాలో పాల్గొన్నాలని కార్మికులను కోరారు. ఈ సమస్యలపై జరుగబోయే ఆందోళనలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నాలని విజ్ఞప్తి చేశారు.